ఐపీఎల్ జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే విజయవాడలోని ఓ ప్రైవేటు పాఠశాలను అడ్డాగా మార్చుకొని... బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఆన్లైన్లోనే బెట్టింగ్ నిర్వహిస్తున్నారని గుర్తించారు. బెట్టింగ్‌కు ఉపయోగించిన 25 సెల్ఫోన్లు, ఎసీడీ, ల్యాఫ్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డీసీపీ హర్షవర్ధన్ రాజ్ తెలిపారు.
బెట్టింగ్ ముఠాలపై ప్రత్యేక నిఘా: డీసీసీ హర్షవర్ధన్ రాజ్ - ఐపీఎల్ బెట్టింగ్ వార్తలు
దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి మొదలైంది. అయితే ఐపీఎల్‌పై ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను ‘క్యాష్’ చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో... పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పుతున్న డీసీపీ హర్షవర్ధన్ రాజ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
డీసీసీ హర్షవర్ధన్ రాజ్