ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నేటితో ముగింపు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరి ఘట్టమైన పూర్ణాహుతిని మధ్యాహ్నం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరిస్వామి వార్ల తెప్పొత్సవం జరగనుంది. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున జల విహారాన్ని రద్దు చేశారు.

Durga temple in Vijayawada
Durga temple in Vijayawada

By

Published : Oct 25, 2020, 5:35 AM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మళ్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులు ఉత్సవాలు చివరి ఘట్టానికి చేరాయి. నవరాత్రుల్లో చివరి రోజు, విజయదశమి అయిన ఇవాళ అమ్మ వారు శ్రీరాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరకు గడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదించే రూపంలో అమ్మవారు సాక్షాత్కరిస్తారు. విజయదశమి రోజున అమ్మవారి దివ్య దర్శనం ద్వారా సకల శుభాలు, విజయాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

ఇవాళ మధ్యాహ్నం పూర్ణాహుతితో నవరాత్రుల వేడుక ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరిస్వామి వార్ల తెప్పొత్సవం వైభవంగా జరగనుంది. ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న దృష్ట్యా జల విహారం లేకుండానే తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ ఉత్సవం జరుగుతున్నంతసేపు కనకదుర్గ వారధిపై రాకపోకలు నిలిపివేయనున్నారు.
ఇదీ చదవండి

ఇంద్రకీలాద్రిపై దసరా వెలుగులు.. దేదీప్యమానంగా అమ్మవారి ఆలయం

ABOUT THE AUTHOR

...view details