ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై వైభవంగా..  దసరా మహోత్సవాలు - indrakeedri dasara celebration news

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు ఇవాళ శ్రీ మహిషాసుర మర్ధనీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపటి తో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది.

ఇంద్రకీలాద్రిపై 8వ రోజు దసరా మహోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై 8వ రోజు దసరా మహోత్సవాలు

By

Published : Oct 14, 2021, 2:05 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు ఇవాళ శ్రీ మహిషాసుర మర్ధనీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్ధనీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

అష్ట భుజాలతో అవతరించి, సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని అమ్మవారు సంహరించిందని.. అలాంటి మహిషాసుర మర్ధనిని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశించి, సాత్విక భావం ఏర్పడుతుందని పురాణోక్తి. సర్వదోషాలూ పటాపంచలై ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.

ఇంద్రకీలాద్రిపై 8వ రోజు దసరా మహోత్సవాలు

రేపటితో దసరా వేడుకలు ముగియనున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. మహిషాసురమర్ధనీ దేవిని దర్శించుకుంటే.. దసరా రోజున రాజరాజేశ్వరిని కూడా తప్పక దర్శించుకోవాలనే భావన భక్తుల్లో ఉండడంతో.. కొండపై భక్తుల రద్దీ పెరిగిపోతోంది.

ఇదీ చదవండి:శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు

ABOUT THE AUTHOR

...view details