ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మీరే తయారు చేయండి..మీరే అమ్ముకోండి' - విజయబ్రాండ్ లో నిత్యవసరాలు

మీరు తయారు చేయండి.. విజయ పేరుతో మీరే అమ్ముకోండి. కానీ బ్రాండ్ ఉపయోగించుకున్నందుకు ప్యాకెట్​కు పావలా ఇస్తే చాలు అని ఏపీ ఆయిల్​ఫెడ్ తెలిపింది. ఇప్పటివరకు విజయ పేరుతో పామోలిన్‌, వేరుసెనగ నూనె తదితర 6 రకాల నూనెలు మార్కెట్‌లో ఉన్నాయి. ఇక నుంచి నిత్యావసరాలూ ఈ బ్రాండ్‌పై దుకాణాల్లోకి రానున్నాయి. అయితే వీటిని ఒక ప్రైవేటు సంస్థ విజయవాడ, విశాఖపట్నంలలో తయారుచేస్తోంది.

Vijaya brand
విజయ

By

Published : Aug 20, 2021, 9:43 AM IST

మీరు తయారు చేయండి.. విజయ పేరుతో మీరే అమ్ముకోండి.. బ్రాండ్‌ ఉపయోగించుకున్నందుకు ప్యాకెట్‌కు పావలా ఇస్తే చాలు అంటోంది ప్రభుత్వ రంగంలోని ఏపీ ఆయిల్‌ఫెడ్‌. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు విజయ పేరుతో పామోలిన్‌, వేరుసెనగ నూనె తదితర 6 రకాల నూనెలు మార్కెట్‌లో ఉన్నాయి. వీటిని తానే ప్యాక్‌ చేసి మార్కెట్‌ చేస్తోంది. ఇక నుంచి నిత్యావసరాలూ ఈ బ్రాండ్‌పై దుకాణాల్లోకి రానున్నాయి. అయితే వీటిని ఒక ప్రైవేటు సంస్థ విజయవాడ, విశాఖపట్నంలలో తయారుచేసి విజయ పేరు ముద్రించి ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో అమ్మకాలు చేసుకుంటుంది. మార్కెటింగ్‌ వ్యవహారమంతా సంబంధిత సంస్థే చూసుకుంటుంది. బ్రాండ్‌ ఉపయోగించుకున్నందుకు ప్యాకెట్‌కు పావలా చొప్పున ఆయిల్‌ఫెడ్‌కు చెల్లిస్తుంది. ఇందులో భాగంగా మినపగుళ్లు, వేరుసెనగ పప్పు, జొన్న, రాగి పిండి, తాలింపు దినుసులు, టీపొడి, ఉప్పు, యాలకులు, మిరియాలు, డ్రైఫ్రూట్స్‌ తదితర 23 రకాల ఉత్పత్తుల్ని విజయ బ్రాండ్‌పై సోమవారం నుంచి మార్కెట్లోకి తెస్తున్నారు. ఉత్పత్తుల్లో నాణ్యత బాధ్యత తమదేనని ఏపీ ఆయిల్‌ఫెడ్‌ ఎండీ శ్రీకంఠనాథరెడ్డి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details