తిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గురుమూర్తిపై అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న కేసుకు సంబంధించిన సమాచారం సేకరణలో భాగంగా సైబర్ క్రైం పోలీసులు గత శనివారం తెదేపా కార్యలయ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టింది ఎవరు? ఆ పేజీకి అడ్మిన్ ఎవరు? తదితర విషయాల గురించి మూడు రోజుల్లో సమాచారం అందించాలని కోరారు. అయితే దీనిపై తెదేపా కార్యాలయ కార్యదర్శి నుంచి సమాధానం రాకపోవటంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. కేసు విచారణలో భాగంగా వైకాపా అభ్యర్థి గురుమూర్తి నుంచి కూడా వివరాలు తీసుకునేందుకు సైబర్ క్రైం అధికారులు సిద్ధమవుతున్నారు.
తిరుపతి వైకాపా అభ్యర్థి గురుమూర్తిపై అభ్యంతరకర పోస్టులపై నోటీసులు - హైదరాబాద్ టీడీపీ కార్యాలయానికి సైబర్ క్రైమ్ నోటీసులు న్యూస్
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తిపై అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై హైదరాబాద్లోని తెదేపా కార్యాలయ కార్యదర్శికి మరోసారి విజయవాడ సైబర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే గతంలోనే నోటీసులు జారీ చేసినా.. స్పందించకపోవడంతో మరోసారి నోటీసులిచ్చారు.
cyber crime police notice to tdp office
TAGGED:
cyber crime police news