ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇదో రకం సైబర్ క్రైమ్.. పోలీసుల పేర్లతోనే నకిలీ ఖాతాలు! - విజయవాడ సైబర్ క్రైమ్ న్యూస్

నేరం చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అందుకే సైబర్ నేరగాళ్లు పంథా మార్చారు. పోలీసుల పేరు, ఫొటోలతోనే ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలు తెరుస్తున్నారు. నగదు అత్యవసరమంటూ పోలీసు గ్రూప్ లోని స్నేహితులకు మెసేజ్ పంపి వసూళ్లు చేస్తున్నారు. తాజాగా విజయవాడలో ఓ ఆర్ఎస్సై పేరుతో 5 వేల రూపాయలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఆర్ఎస్సై.. సైబర్ క్రైమ్ కు సమాచారమిచ్చారు. జార్ఖండ్ కేంద్రంగా దందా కొనసాగుతున్నట్లు ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.

cyber crime happend in vijayawada on police
cyber crime happend in vijayawada on police

By

Published : Sep 10, 2020, 6:47 PM IST

ఇదోరకం సైబర్ క్రైమ్.. పోలీసుల పేర్లతోనే నకిలీ ఖాతాలు!

"నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను.. అత్యవసరంగా 5 వేల రూపాయలు అవసరం ఉంది" అంటూ ఓ ఎస్సై ఫేస్ బుక్ లో తన స్నేహితునికి మెసేజ్ పంపారు. పేటీఎంలో డబ్బులు పంపాలని మెసేజ్ లోనే నెంబర్ ఇచ్చారు. ఆ స్నేహితుడు వెంటనే ఎస్సై కి ఫోన్ చేసి డబ్బులు పంపించినట్టు చెప్పారు. దీంతో ఎస్సై షాక్ తిన్నాడు. ఏ నంబర్ కు డబ్బులు పంపించావని అడగ్గా.... ఫేస్ బుక్ మెసేజ్ లో పంపిన నంబర్ కు డబ్బులు వేశానన్నారు. షాక్ తిన్న ఎస్సై.. అంతా ఫేక్ అని గ్రహించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. విజయవాడ సైబర్ క్రైమ్ ఇన్స్​పెక్టర్ శివాజీ... ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఫోన్ లొకేషన్ జార్ఖండ్ అని, పేటీఎం ఖాతా అడ్రస్ పంజాబ్ లోని లూథియానా లో ఉందని గుర్తించారు.

రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ ,కృష్ణా ,ప్రకాశం జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల ఇలాంటి దందా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మొదట బాధితుల ఫేస్ బుక్ నుంచి ఫొటోలు, స్నేహితుల వివరాలు సేకరిస్తారు. పోలీసు అధికారుల ఫొటోలను వినియోగించి నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరుస్తారు. ఫేస్ బుక్ లోని స్నేహితులకు ఆపదలో ఉన్నానని మెసేజ్ పంపి నగదు వసూలు చేస్తారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి నేరాలపై సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని.. అన్నీ ధృవీకరించుకున్నాకే నగదు లావాదేవీలు చేయాలని సూచించారు. సైబర్ నేరాలు రాజస్థాన్ లోని భరత్ పూర్ తో పాటు... గుజరాత్, ఝార్ఖండ్, నోయిడా, గూర్​గావ్ కేంద్రంగా జరుగుతున్నాయని పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details