ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్మీ పేరుతో దోపిడీ.. సైబర్‌ నేరగాళ్ల నయా మోసాలు - CYber news in ap

నేను ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాను.... వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్తున్నా.. వస్తువులు తక్కువ ధరకు ఇస్తామంటూ ఓఎల్ఎక్స్​లో విక్రయానికి ఉంచుతారు. నఖిలీ ఐడీ కార్డు, ఆర్మీ దుస్తులతో ఉన్న ఫొటో పంపి బురిడీ కొట్టిస్తారు. మాయమాటలు నమ్మితే.... విడతల వారీగా నగదు దోచుకుంటారు. ఆర్మీ అధికారుల మంటూ ఆన్ లైన్ లో అమాయకుల నగదు దోచుకుంటున్న వైనంపై ప్రత్యేక కథనం.

cyber-cheating-cases
సైబర్‌ నేరగాళ్ల నయా మోసాలు

By

Published : Jun 23, 2020, 2:40 PM IST

ఆర్మీ అధికారులంటే అందరికీ గౌరవం. ఇదే అవకాశంగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్​లైన్ సైట్లలో వస్తువులు విక్రయాలకు ఉంచి ఆర్మీ అధికారులమంటూ నమ్మించి .. అమాయకులను నట్టేట ముంచుతున్నారు. సైబర్ కిలాడీలు తాజాగా కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన ఓ యువకుడి జేబులు ఖాళీ చేశారు. గన్నవరానికి చెందిన ఓ యువకుడు ఆన్​లైన్ సైట్​లో ఏసీ కొనాలని నిర్ణయించుకున్నాడు. 10 వేల రూపాయలకే ఏసీ వస్తుందనే ప్రకటన చూసి వారితో ఫోన్​లో మాట్లాడాడు.

ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నానని.. తన పేరు శ్యామ్ కుమార్ అని నిందితుడు తెలిపాడు. బదిలీ పై వేరే ప్రాంతానికి వెళుతున్నానని... అందుకే అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నానని నమ్మించాడు . ఆర్మీ దుస్తులతో ఉన్న ఫొటో, ఐడీకార్డును సైతం మెయిల్​కు పంపాడు. ఏసీని డెలివరీ చేశానని ఓ రశీదును సైతం పంపాడు. నిందితుని మాటలు నమ్మిన యువకుడు పేటీఎం ద్వారా మూడు వేల రూపాయల నగదు జమచేశాడు.

నగరానికి చెందిన మరో మహిళ ఇదే తరహాలో 20 వేల రూపాయల నగదును నిందితుని ఖాతాలో జమ చేసింది. కారు, రిఫ్రిజిరేటర్, ఏసీ లాంటి వస్తువులను ఎరవేసి ..ఆర్మీ అధికారుల ముసుగులో నకిలీ ఐడీ కార్డులు సృష్టించి అమాయకుల నగదు దోచేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెపుతున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఈ తరహా 16 కేసులు నమోదు అయ్యాయని ఇన్స్​స్పెక్టర్ చెపుతున్నారు. మరికొన్ని ఫిర్యాదులు పరిశీలనలో ఉన్నాయన్నారు.


ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేటప్పుడు, విక్రయించేటప్పుడు పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలని పోలీసులు చెబుతున్నారు. వస్తువు డెలీవరీ అయిన తర్వాతనే నగదు జమ చేయాలని సూచిస్తున్నారు.


ఇవీ చదవండి:ఏం ఐడియా గురూ: అమ్ముడవని అరటిపళ్లను ఎండబెట్టి..

ABOUT THE AUTHOR

...view details