కరోనా పాజిటివిటీ రేటు ఆధారంగా జిల్లాలో కర్ఫ్యూ సడలింపులు చేస్తున్నట్లు.. ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సడలింపులు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 12 లక్షల మంది 5 ఏళ్ల లోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సిన్ వేయడం పూర్తైందని, మరో 6 లక్షల మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. 53 లక్షల డోసుల వ్యాక్సిన్.. జులైలో సరఫరా చేస్తామని కేంద్రం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
35 బ్లాక్ ఫంగస్ కేసులు...
గడిచిన 24 గంటల్లో 35 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని సింఘాల్ తెలిపారు. పాజిటివ్ కేసులుపై అధ్యయనం చేశామని.. మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో.. 5,515 వార్డు సచివాలయాల్లో ఒక్క యాక్టివ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. కేవలం ఒక్క కేసు ఉన్న సచివాలయాలు 3110, రెండు కేసులు ఉన్న సచివాలయాలు 1,891 ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 676 మండలాల్లో.. 10 కంటే తక్కువ కేసులు ఉన్న మండలాలు 105 ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జలాల్లో ఇప్పుడు 10 శాతం కంటే తక్కువ కేసులు ఉన్నాయన్నారు. 8 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయని, 5 శాతం కంటే ఎక్కువగా ఐదు జిల్లాలు ఉన్నాయన్నారు. చిత్తూర్, ప్రకాశం జిల్లాల్లో పాజిటివ్ కేసులు 5 శాతం కంటే తక్కువకు పడిపోయాయని వివరించారు.
ఇదీ చదవండి:
RDS Controversy: ఆర్‌డీఎస్ కుడికాలువ నిర్మాణం సక్రమమే: మంత్రి అనిల్