విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారిని ప్రోత్సహించేందుకు విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో 'సంపద- 2కె20' అంతర్ కళాశాలల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యాసరచన, పోస్టర్ మేకింగ్, క్విజ్, మిస్టర్ అండ్ మిస్ పర్సనాలిటీ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు తమలోని ప్రతిభను ప్రదర్శిస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఫ్యాషన్ షో అలరించాయి.
స్టెల్లా కళాశాలలో అలరించిన 'సంపద 2కె 20' పోటీలు - vijayawada latest updates
విజయవాడలోని మారిస్ స్టెల్లా కాలేజీలో సంపద- 2కె20 పోటీలు యువతను అలరించాయి. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఈ పోటీలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

విజయవాడ స్టెల్లా కాలేజీలో 'సంపద 2కె 20' పోటీలు
స్టెల్లా కళాశాలలో అలరించిన సంపద 2కె20 పోటీలు