CS sameer Sharma on Employees Strike: ఉద్యోగులు సమ్మె వరకూ వెళ్లకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు, హెచ్వోడీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, ఆర్థికశాఖ, ఇతర ఉన్నతాధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమయ్యారు. కొత్త పీఆర్సీ జీవోల ప్రకారం వేతనాల బిల్లులు ఎంత వరకూ వచ్చాయన్న దానిపై సీఎస్ సమీక్షించారు. చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయనే విషయాన్ని ఉద్యోగులకు తెలియచెప్పాలని కలెక్టర్లు, ఆయా శాఖల అధిపతులకు సూచించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమేనని.. వేరుకాదన్న విషయాన్ని తెలియచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. హర్తాళ్లు, ఆందోళనలు చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కార్మికులు కాదని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 వారికి రక్షణ కల్పిస్తోందని సీఎస్ వ్యాఖ్యానించారు.