ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CS Review On Oil Prices: వినియోగదారులకు అందుబాటులో వంటనూనె ధరలు: సీఎస్ సమీర్​శర్మ - వంటనూనె ధరల విషయంపై సీఎస్ సమావేశం

CS review on oil prices: వంటనూనె ధరలు నిర్ణయించిన రేటుకే వినియోగదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ.. అధికారులను ఆదేశించారు. ప్రైస్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో.. సచివాలయంలో సీఎస్ సమావేశం నిర్వహించారు.

CS review on oil prices
వినియోగదారులకు అందుబాటులో వంటనూనె ధరలు: సీఎస్ సమీర్​శర్మ

By

Published : Mar 16, 2022, 8:13 AM IST

CS review on oil prices: రైతు బజారుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వంటనూనె ధరలు నిర్ణయించిన రేటుకే వినియోగదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మార్కెటింగ్, పౌర సరఫరా శాఖాధికారులను ఆదేశించారు. ప్రైస్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో సచివాలయంలో సీఎస్ సమావేశం నిర్వహించారు.

హోల్ సేల్ డీలర్లు, మిల్లర్లు, రిఫైనరీ దారులు, స్టాకిస్టులు.. కేంద్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్​కు అనుగుణంగా స్టాకు పరిమితుల పాటించటంపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. అక్రమ స్టాకును గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని.. బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసి వినియోగదారులకు అందేలా చూడాలని అన్నారు. సన్‌ ఫ్లవర్, వేరుశనగ, పామాయిల్ లాంటి వంట నూనెలు సామాన్యులకు అందేలా చూడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details