రోడ్డుపై వెళ్తున్న వలస కార్మికులను చూసి.. కాన్వాయ్ ఆపి.. వారితో సీఎం నీలం సాహ్ని మాట్లాడారు. సీఎంతో సమావేశం అనంతరం అక్కడికి సమీపంలోనే జాతీయ రహదారిపై వెళ్తున్న కూలీలను చూసి కాన్వాయ్ నిలిపి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. చెన్నై నుంచి బీహార్ కు నడిచి వెళ్తున్నామని వలస కూలీలు చెప్పటంతో స్పందించిన ఆమె.. తక్షణం గుంటూరు, కృష్ణా జాయింట్ కలెక్టర్లతో మాట్లాడారు. వారికి వసతి, భోజనం కల్పించాల్సిందిగా ఆదేశించారు. వెంటనే బీహార్ కు వెళ్లే శ్రామిక్ రైళ్లలో వారిని పంపాల్సిందిగా సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ నడిచి వెళ్తున్న వారికి నచ్చజెప్పి సహాయ కేంద్రాలకు తరలించాలని మొదటి ప్రాధాన్యతగా వారిని వారి స్వరాష్ట్రాలకు పంపాలని మరోమారు సీఎస్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.
వలస కార్మికులతో మాట్లాడిన నీలం సాహ్ని - వలస కూలీలపై నీలం సాహ్ని వ్యాఖ్యలు న్యూస్
లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయి స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కొద్దిసేపు మాట్లాడారు. వారికి వసతి, భోజనం కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
cs nilam sahni spoke with migrant labourers on road