ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 21, 2020, 2:57 PM IST

ETV Bharat / city

కొవిడ్ నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, ఇటువంటి సమయంలోనే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.

కొవిడ్ నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు
కొవిడ్ నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు

రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 21 నుంచి 31 వ తేదీ వరకు కొవిడ్ నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు. అందులో భాగంగానే విజయవాడలో ఫ్రంట్ లైన్ వారియర్స్ తో అవగాహనా ర్యాలీ చేపట్టామన్నారు. కొవిడ్ పాజిటివ్ కేసు నమోదులో తారాస్థాయికి వెళ్లామని, ఇప్పుడు ఆ స్థాయి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టిందన్నారు.

మళ్లీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రత్తమంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. లాక్ డౌన్ నుంచి బయటపడి అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయని.. పాఠశాలలు కూడా ప్రారంభిస్తున్నామని వివరించారు. మాస్కే మన కవచం, మాస్క్ ధరించండి, మాకు సహకరించండి అని కలెక్టర్ ఇంతియాజ్ ప్రజల్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details