ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

By

Published : Feb 18, 2021, 7:30 PM IST

Updated : Feb 18, 2021, 9:42 PM IST

తిరుపతి వేదికగా మార్చి నాలుగో తేదీన జరగనున్న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి.. అజెండా అంశాలపై నివేదిక ఇవ్వాలని సీఎస్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.

దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంపై సీఎస్ సమీక్ష
దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంపై సీఎస్ సమీక్ష

అంతర్రాష్ట్ర సంబంధాలు, సరిహద్దు వివాదాలు, నీటి వివాదాలు, విభజన హామీల అమలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం మార్చి నాలుగో తేదీన జరగనుంది.

ఏపీకి సంబంధించి 41 అజెండా అంశాల్లో 20కి పైగా రాష్ట్రం నుంచి మరో 20 అంశాలను కేంద్ర హోం వ్యవహారాల శాఖ నిర్దేశించనుంది. మరోవైపు తిరుపతి వేదికగా జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యే వీవీఐపీల భద్రత, బస ఏర్పాట్లపై సీఎస్ మరోమారు ఆరా తీశారు.

Last Updated : Feb 18, 2021, 9:42 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details