ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సీఎస్ సమీక్ష - 26th January

ఈ నెల 26న విజయవాడలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ అదిత్య నాథ్ దాస్ ఆదేశించారు. కొవిడ్ నిబంధనల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

cs adityanath review on republic day
గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సీఎస్ సమీక్ష

By

Published : Jan 13, 2021, 3:49 AM IST

ఈ నెల 26న విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలపై సీఎస్ అదిత్య నాథ్ దాస్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై డీజీపీ గౌతం సవాంగ్​తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

ప్రత్యేక శకటాలు..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సీఎస్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక శకటాలతో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. సమాచార శాఖతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కార్యక్రమ వివరాలను తెలియజేశారు.

ప్రత్యేక ఏర్పాట్లు...

కొవిడ్ నిబంధనల మేరకు ఆరు అడుగుల దూరంలో సీటింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. అంతేగాక గత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆహ్వానితుల సంఖ్యలో ఐదో వంతు మంది ఈసారి వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

ఈ సారి వ్యవసాయ, గృహ నిర్మాణ, నీటి పారుదల, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, పర్యాటక, మహిళా శిశు సంక్షేమ, పారిశ్రామిక, పెట్టుబడుల శాఖలకు సంబంధించిన శకటాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.

ఇదీచూడండి:

కరోనా వాక్సినేషన్‌పై జిల్లాల ఉన్నతాధికారులతో సీఎస్‌ సమావేశం

ABOUT THE AUTHOR

...view details