ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 2, 2021, 9:31 PM IST

ETV Bharat / city

CS ON AADHAR: యూఐడీఏఐ అధికారులతో సీఎస్​ సమీక్షా సమావేశం

రాష్ట్రంలో ఆధార్ పెండింగ్ ప్రాజెక్టులపై యూఐడీఏఐ అధికారులు నిర్వహించిన సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్​ దాస్ హాజరయ్యారు. ఇప్పటిదాకా ఆధార్ కార్డుల జారీ, ఫోన్​ నంబర్​తో అనుసందానం వంటి వివరాలను వెల్లడించారు.

CS ON AADHAAR
CS ON AADHAAR

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3 కోట్ల 56 లక్షల 373 మొబైల్ ఫోన్లతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తైందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్​ దాస్ స్పష్టం చేశారు. ఆధార్ పెండింగ్ ప్రాజెక్టులపై దిల్లీ నుంచి యూఐడీఏఐ అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో సీఎస్ పాల్గొన్నారు.

2021 అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న 5.28 కోట్ల జనాభాలో.. 5.11 కోట్ల మందికి ఆధార్ జారీ చేసినట్టు వెల్లడించారు. ఐదేళ్లలోపు వయసున్న పిల్లల జనాభా అంచనాల ప్రకారం 34 లక్షల 49 వేలలో 17 లక్షల మందికి ఆధార్ కార్డులు జారీ అయ్యాయని స్పష్టం చేశారు. అలాగే 5 నుంచి 18 ఏళ్లలోపు మధ్య వయసున్న 98 లక్షల 17 వేల మందికి ఇప్పటికే ఆధార్ జారీ చేసినట్టు వివరించారు. 18 ఏళ్లు పైబడిన వ్యక్తుల జనాభా 3 కోట్ల 95 లక్షల మేర ఉంటే.. వారందరికీ కార్డుల జారీ వందశాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఆధార్ సేవలు వినియోగించే వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. త్వరలో ఫేషియల్ రికగ్నిషన్ పద్దతిలో ఆధార్ గుర్తింపు చేసేలా సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్లు యూఐడీఏఐ అధికారులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details