ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సునీల్​కుమార్, మోకా సత్తిబాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య - Varla Ramaiah letter to DGP

సీఐడీ, అదనపు డీజీ సునీల్​కుమార్, కృష్ణా జిల్లా అదనపు ఎస్పీ మోకా సత్తిబాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ గౌతం సవాంగ్​కు లేఖ రాశారు.

వర్ల రామయ్య
వర్ల రామయ్య

By

Published : Jun 17, 2021, 4:33 PM IST

సీఐడీ, అదనపు డీజీ సునీల్​కుమార్, కృష్ణా జిల్లా అదనపు ఎస్పీ మోకా సత్తిబాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీ గౌతం సవాంగ్​కు లేఖ రాశారు. "అంబేడ్కర్ ఇండియన్ మిషన్ పేరిట ఓ సంస్థను సునీల్​కుమార్ ఏర్పాటు చేసి.. బ్రిటీష్ పాలకులను గొప్పచేసి భారత సంప్రదాయాన్ని కించపరిచేలా మాట్లాడారు. ఎస్సీలు ఉగ్రవాదుల తరహాలో ఆత్మార్పణకు సిద్ధపడేందుకు స్వచ్ఛంద సంస్థను స్థాపించాలని రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచేలా కార్యక్రమంలో ప్రసగించారు. అమెరికాలో ట్విన్ టవర్లను కూల్చిన ఉగ్రవాదుల్ని ఎస్సీలు ఆదర్శంగా తీసుకోవాలని మోకా సత్తిబాబు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న ఇద్దరు అధికారులు సర్వీస్ కాండక్ట్ రూల్స్​ను ఉల్లంఘించి మాట్లాడినందుకు రాజద్రోహం కేసు పెట్టి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి." అని కోరారు. సునీల్​కుమార్, సత్తిబాబు వీడియో ప్రసంగాలను తన లేఖకు వర్ల రామయ్య జతచేశారు.

వర్ల రామయ్య లేఖ

ABOUT THE AUTHOR

...view details