ప్రభుత్వ ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు చేయాలంటూ స్థిరాస్తి వ్యాపారులు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజాశ్రీనివాస్, కార్యదర్శి బోస్, సలహాదారు శివారెడ్డి, ఆర్‌ఎల్ స్వామి తదితరులు విజయవాడలో వినతిపత్రం అందజేశారు. కొవిడ్ వల్ల రాష్ట్రంలో చాలా నిర్మాణ ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని... వీటి సమయం పొడిగించాలని కోరారు. ఖాళీ స్థల పన్ను ఉత్తర్వులు అమలు చేయాలని, వ్యవసాయేతర భూమిశిస్తు పన్ను తగ్గించాలని దీంతో పాటు 5 శాతం స్టాంప్ డ్యూటీని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి బొత్సతో క్రెడాయ్ ప్రతినిధుల భేటీ...సమస్యలపై వినతిపత్రం
ప్రభుత్వ ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు చేయాలంటూ స్థిరాస్తి వ్యాపారులు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజాశ్రీనివాస్, కార్యదర్శి బోస్, సలహాదారు శివారెడ్డి, ఆర్‌ఎల్ స్వామి తదితరులు విజయవాడలో వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో నిర్మాణ రంగం పుంజుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రి బొత్సతో చర్చించి తమ అభిప్రాయాలను వివరించారు. పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ అనుమతుల మంజూరు, ఇతర అంశాల్లోని సాఫ్ట్‌వేర్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక, సిమెంట్, ఇతర భవన నిర్మాణ సామగ్రి ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయని... ఈ పరిస్థితుల్లో స్టాంపు డ్యూటీ తగ్గించడం ద్వారా ఎక్కువ మంది కొనుగోలుదారులకు మేలు జరుగుతుందని తెలిపారు. తమ సమస్యలపై మంత్రి బొత్స సానుకూలంగా స్పందించారని క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. సాధ్యమైనంత త్వరలోనే సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: