కరోనా వ్యాప్తితో దేశమంతా లాక్డౌన్ కొనసాగుతోంది. పనులు కోల్పోయి.. తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్న పేదవారికి అండగా నిలిచేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. విజయవాడలో కరోనా వ్యాప్తి కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి.. క్రెడాయ్ సంస్థ నిత్యావసరాలు పంపిణీ చేసింది. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో.. 3 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసరాలను క్రెడాయ్ విజయవాడ చాప్టర్ అధ్యక్షులు ఆర్వీ స్వామి పంపిణీ చేశారు.
నిరుపేదలకు అండగా నిలిచిన క్రెడాయి సంస్థ - credai food supply to poor people news
లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు ఆసరాగా నిలుస్తున్నారు దాతలు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారి కడుపు నింపుతున్నారు.

credai food supply to poor people
TAGGED:
vijayawada lock down news