ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Farmers Letter to CRDA : అమరావతి రైతులకు అవమానం.. ముఖం చూడని సీఆర్డీఏ కమిషనర్ - CRDA Denies Appointment to Farmers

Capital Farmers Requesting Letter to CRDA: హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పనులు మొదలు పెట్టాలంటూ రాజధాని రైతులు విజ్ఞాపన పత్రాన్ని సీఆర్డీఏ కమిషనర్ కు అందించేందుకు వెళ్లారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. కనీసం అధికారుల అపాయింట్ మెంట్ కూడా దొరక్క వెనుదిరిగిన పరిస్థితి ఎదురైంది.

CRDA Denies Appointment to Farmers
CRDA Denies Appointment to Farmers

By

Published : May 4, 2022, 9:33 PM IST

CRDA Denies Appointment to Farmers: రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సీఆర్డీఏ ఉన్నతాధికారులు కనీసం ముఖం కూడా చూపించడం లేదు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పనులు మొదలు పెట్టాలంటూ సీఆర్డీఏ కమిషనర్ కు విజ్ఞాపన పత్రాన్ని అందించేందుకు వెళ్లిన రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని దుస్థితి నెలకొంది.

విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి విజ్ఞాపన పత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతులు గంటల తరబడి వేచి ఉన్నా అధికారులు కలకవక పోవటంతో ఉసూరుమంటూ వెనక్కి తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడింది.

సారూ...విజ్ఞాపన పత్రం తీసుకోరూ...!!

విజ్ఞాపన పత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతులకు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ కనీసం ముఖం చూపించేందుకు కూడా ఇష్ట పడలేదు. గంటల తరబడి వేచి చూసినా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటంతో.. రైతులు చేసేది లేక ఆయన పేషీలోనే విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చేసి వెనక్కు రావాల్సిన అగత్యం ఏర్పడింది. కౌలుతోపాటు ఎల్పీఎస్ లే ఆవుట్లలో తమ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా సరిహద్దు రాళ్లు వేయాలని అడిగేందుకు రాజధాని ప్రాంతం నుంచి కొందరు రైతులు బృందంగా విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.

రైతులు వెళ్లిన సమయంలో సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ వారిని కలిసేందుకు ఇష్టపడలేదు. గంటల తరబడి రైతుల బృందం ఎదురు చూసినా ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వక పోవడంతో రైతులు కమిషనర్ పేషీలోనే సదరు విజ్ఞాపన పత్రాన్ని అందించేసి చేసేదిలేక వెనుదిరిగారు. గతంలో రాజధాని రైతులకు అగ్రతాంబూలం ఇచ్చిన సీఆర్డీఏ అధికారులు ఇప్పుడు వారిని కనీసం కలిసి మాట్లాడేందుకు కూడా ఇష్టపడకపోవటంపై ఆక్షేపణీయంగా మారింది.

ఇదీ చదవండి :సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details