ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేరు మార్చినా ఓపీఎస్ ప్రయోజనాలు దక్కాలన్నదే మా డిమాండ్ - సీపీఎస్ రద్దు న్యూస్

CPS Employees On OPS పేరు మార్చినా ఓపీఎస్ ప్రయోజనాలు దక్కాలన్నదే తమ డిమాండ్ అని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు చేసేంతవరకు ఆందోళన ఆపేది లేదని తేల్చిచెప్పారు. మంత్రి బొత్స నివాసంలో జరిగిన సమావేశానికి హాజరైన నేతలు పాత పెన్షన్ అంటేనే మంత్రితో చర్చలకు అంగీకరించామని తెలిపారు.

పేరు మార్చినా ఓపీఎస్ ప్రయోజనాలు దక్కాలన్నదే మా డిమాండ్
పేరు మార్చినా ఓపీఎస్ ప్రయోజనాలు దక్కాలన్నదే మా డిమాండ్

By

Published : Aug 24, 2022, 3:26 PM IST

CPS Employees On Old Pension Scheme: సీపీఎస్ రద్దు చేయటం మినహా మరో మార్గమేదీ లేదని ప్రభుత్వానికి తెలిపామని సీపీఎస్ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ నివాసంలో జరిగిన సమావేశానికి సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలతో పాటు.. ఏపీ సచివాలయంలోని సీపీఎస్ ఉద్యోగులు హాజరయ్యారు. సెప్టెంబరు 1వ తేదీన నిర్వహించే సీఎం నివాసం ముట్టడి, విజయవాడ మిలియన్ మార్చ్ కార్యక్రమాలను విరమించుకోవాల్సిందిగా మంత్రి బొత్స కోరినట్టుగా ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. పాత పెన్షన్​పై చర్చిస్తామంటేనే మంత్రి బొత్స వద్ద చర్చలకు హాజరయ్యామని సీపీఎస్ ఉద్యోగులు వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రాజస్థాన్, ఛత్తీస్​ఘడ్​ రాష్ట్రాల్లో సీపీఎస్​ను రద్దు చేశారని గుర్తు చేశారు. పథకం పేరు మార్చినా పాత పెన్షన్ స్కీం ప్రయోజనాలు దక్కాలన్నదే ఉద్యోగులుగా తమ డిమాండ్ అని స్పష్టం చేశారు.

ప్రభుత్వం సీపీఎస్​ను రద్దు చేసేంత వరకూ తమ ఆందోళనలు ఆపేది లేదని ఉద్యోగ సంఘ నేతలు స్పష్టం చేశారు. గతంలో ప్రకటించిన కార్యాచరణ కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. సెప్టెంబరు 1న నిర్వహించనున్న సీఎం నివాసం ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్​ను ఉద్యోగ సంఘాల నేతలు ఆవిష్కరించారు. సీపీఎఎస్ ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే తమ నివాసాల్లో కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారని.. ప్రభుత్వం భయపెట్టే చర్యలు మానుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.

పేరు మార్చినా ఓపీఎస్ ప్రయోజనాలు దక్కాలన్నదే మా డిమాండ్

"పాత పెన్షన్ అంటేనే మంత్రితో చర్చలకు వచ్చాం. సీపీఎస్ రద్దు చేసేంతవరకు ఆందోళన ఆపేది లేదు. ఇచ్చిన కార్యాచరణ కొనసాగుతుంది. శుక్రవారం మరోసారి చర్చలు జరుగుతాయన్నారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో సీపీఎస్ రద్దు చేశారు. పేరు మార్చినా ఓపీఎస్ ప్రయోజనాలు దక్కాలన్నదే డిమాండ్." - సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు

మరోమారు చర్చలు: సెప్టెంబర్ 1న తలపెట్టిన సీఎం జగన్ నివాసం ముట్టడి, చలో విజయవాడ కార్యక్రమాలను విరమించుకోవాలని మంత్రి ఉద్యోగ సంఘాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై మరోమారు చర్చలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. శుక్రవారం ఆర్ధిక మంత్రి బుగ్గనతోనూ చర్చలకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రి బొత్స సూచించారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details