'వ్యవసాయ బిల్లుల ఆమోదంపై సీపీఎం ఆందోళన' - worried over passage of bills
వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ విజయవాడలో సీపీఎం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 25న దేశ వ్యాప్తంగా జరిగే రైతాంగ ఉద్యమానికి సీపీఎం సంపూర్ణ మద్ధతు ఇస్తున్నామన్నారు.
!['వ్యవసాయ బిల్లుల ఆమోదంపై సీపీఎం ఆందోళన' CPM worried over passage of bills](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8880464-267-8880464-1600686822445.jpg)
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ విజయవాడలో సీపీఎం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రైతుల మెడలో తాడు కట్టి వైకాపా, తెదేపా, భాజపా ఉరి వేసినట్లు వినూత్నరీతిలో ఆందోళనకు దిగారు. రాజ్యసభలో భాజపా అప్రజాస్వామికంగా వ్యవసాయ బిల్లులను అమోదించుకుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా...బిల్లు పాస్ చేసుకున్నారన్నారు. ఈ బిల్లులు చట్టాలైతే వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఈ బిల్లులను వైకాపా, తెదేపా సమర్థించటం సిగ్గు చేటన్నారు. ఈ నెల 25న దేశవ్యాప్తంగా జరిగే రైతాంగ ఉద్యమానికి సీపీఎం సంపూర్ణ మద్ధతు ఇస్తుందన్నారు.