ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాంబే కాలనీలో విద్యుత్​ నోటీసులపై సీపీఎం ఆందోళన - cpm vijayawada latest news

విజయవాడ నగర శివారు వాంబే కాలనీలోని ప్రజలకు విద్యుత్​ బకాయిలపై అధికారులు డిమాండ్​ నోటీసులు అందజేశారు. ఈ విషయంపై సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్​ బాబూరావు కాలనీలో పర్యటించి అక్కడి ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బకాయిల పేరుతో అధికారులు వేధించడం సమంజసం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

cpm worried about current bill demand notice in vijayawada vambay colony
విద్యుత్​ నోటీసులపై సీపీఎం ఆందోళన

By

Published : Feb 27, 2020, 7:51 PM IST

విద్యుత్​ నోటీసులపై సీపీఎం ఆందోళన

విజయవాడ వాంబే కాలనీలో నివాసముంటున్న వారికి కరెంట్​ బిల్లు బకాయిలపై విద్యుత్​ శాఖ అధికారులు డిమాండ్​ నోటీసులు అందజేశారు. దీనిపై అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్​ బాబూరావు ఆధ్వర్యంలో నాయకులు కాలనీలోని ప్రజలను కలుసుకున్నారు. విద్యుత్​ నోటీసులపై జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అంతంత మాత్రం ఆదాయంతో బతికే వారికి బకాయిల పేరుతో డిమాండ్​ నోటీసులు ఇచ్చి వేధించడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై త్వరలో ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details