వార్డు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో సమస్యలు ఇంకా ఉంటున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీ.హెచ్. బాబురావు పేర్కొన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని వడ్డెర కాలనీ, తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. దరఖాస్తు పెట్టిన పది రోజుల్లోగా కొత్త బియ్యం కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామన్న ప్రభుత్వం... ఆచరణలో చూపడంలేదన్నారు. పలుసాకులతో వితంతువులు, వృద్ధుల పింఛన్లు తొలగించారని మండిపడ్డారు.
'క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం ఎప్పుడో..?'
విజయవాడ వడ్డెర కాలనీలో సీపీఎం బృందం పర్యటించింది. వార్డు లంటీర్లు, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినా ఇంకా క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు విమర్శించారు. బియ్యం కార్డులు లేనివారు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలిపారు.
వడ్డెర కాలనీలో పర్యటించిన సీపీఎం బృందం