కేంద్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోకుండా వారిపై భారం మోపుతుందని సీపీఎం నేత సీహెచ్ బాబూరావు ఆరోపించారు. భాజపా విధానాలను నిరసిస్తూ ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకు సీపీఎం దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ న్యూరాజరాజేశ్వరి పేటలో ఉద్యమ ప్రచార కార్యక్రమాన్ని బాబూరావు ప్రారంభించారు. కరోనా కాలంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన, ఆత్మ నిర్భర్ భారత్ పథకం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని బాబురావు విమర్శించారు.
'కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం' - కేంద్రంపై సీపీఎం నేత సీహెచ్ బాబురావు కామెంట్స్
కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నాయని సీపీఎం నేత సీహెచ్ బాబూరావు ఆరోపించారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రజలపై భారం మోపుతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 20 నుంచి 26వ వరకూ దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు.
20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ పేరుతో పక్కా మోసం చేశారని మండిపడ్డారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అదనంగా వెయ్యి రూపాయల సహాయం కాగితాలకే పరిమితం అయ్యిందని విమర్శించారు. ఉచిత బియ్యం పేరుతో ప్రభుత్వాలు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నాయన్నారు. భవన, నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సాయం నీటి మీద రాతలేనని బాబూరావు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు బి.రమణరావు, టి.శ్రీను, దమ్మాసి రమణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :'బలహీనవర్గాలపై దాడుల పట్ల సీఎం స్పందించకపోవటం దారుణం'