cpm protest in vijayawada: అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజయవాడ ధర్నాచౌక్‌లో ఇవాళ సీపీఎం నిరాహారదీక్ష చేపట్టింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష జరగనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టబద్ధ హమీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణా మౌలిక సదుపాయాలకు కేంద్రం నిధులివ్వాలని, అమరావతి రైలు ప్రాజెక్టుకు కేంద్రం కేటాయింపులు చేయాలని స్పష్టం చేశారు.
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో అమరావతి రాజధానికి ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. బడ్జెట్ను రివైజ్ చేసి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రధాని చీకట్లో విభజన జరిగింది అని అంటున్నారు, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎంపీ విజయసాయి రెడ్డి ఊరికే మాట్లాడ్డం కాదు అని అందరిని కలుపుకుని దిల్లీ తీసుకువెళ్లాలని సూచించారు. అమరావతిగా రాజధానిని ఇక్కడే కొనసాగించి అభివృద్ధి చేయాలని కోరారు.