'మూడు రాజధానులపై ఎవరూ సంతోషంగా లేరు' - అమరావతిపై సీపీఎం మధు
శాసన మండలి రద్దు, రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాలతో వైకాపా తన గొయ్యి తానే తవ్వుకుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ విజయవాడ ధర్నా చౌక్‌లో చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షలో మధు పాల్గొన్నారు. మూడు రాజధానులపై ఏ ప్రాంత ప్రజలూ సంతోషంగా లేరన్నారు. తక్షణమే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అమరావతిపై సీపీఎం మధు వ్యాఖ్య