ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'భద్రాచలాన్ని ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు' - భద్రాచలం సమస్యలపై సీపీఎం ర్యాలీ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భద్రాచలానికి ముప్పు ఉందంటూ తెలంగాణ సీపీఎం నాయకులు ఆరోపించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని కోరుతూ చేపట్టిన ప్రజాచైతన్య పాదయాత్రలో భాగంగా భద్రాచలం సబ్​ కలెక్టర్​ కార్యాలయాన్ని ముట్టడించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పట్టణాన్ని ముంచేందుకు యత్నిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్​ రావు విమర్శించారు.

'భద్రాచలాన్ని ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు'
'భద్రాచలాన్ని ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు'

By

Published : Feb 15, 2021, 10:59 PM IST

భద్రాచలంలో సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆ రాష్ట్ర సీపీఎం నాయకులు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించకుండా పట్టణాన్ని ముంచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మండిపడ్డారు. డిమాండ్ల సాధన కోసం సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాచైత్యన్య యాత్ర పాదయాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా చివరిరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.

సమస్యలను పరిష్కరించాలంటూ సబ్​ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిడియం బాబురావు, అన్నవరపు కనకయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేశ్, బాల నర్సారెడ్డి, రేణుక, వెంకటరెడ్డి, వైవీ రామారావు, బండారి శరత్, గడ్డం స్వామి పాల్గొన్నారు.

ఇదీ చూడండి :దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఓటమితోనే ఉద్యోగాల ప్రకటన: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details