ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

cpm: విద్యుత్ ప్రైవేటీకరణ నిలిపివేయాలి - Vijayawada latest news

విజయవాడ గుణదల విద్యుత్ సౌధ ఎదుట సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ కరపత్రాల పంపిణీ చేశారు.

cpm leaders
సీపీఎం నాయకులు నిరసన

By

Published : Sep 9, 2021, 2:28 PM IST

పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని కోరుతూ.. విజయవాడ గుణదల విద్యుత్ సౌధ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పలువులు నేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details