రాష్ట్రవ్యాప్తంగా ఉగాది పండగ జరుపుకుంటున్నా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం పస్తులున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు అన్నారు. విజయవాడలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమైన బాబూరావుకు కార్మికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పండగపూట కార్మికులను పస్తులుంచుతోందని ఆయన మండిపడ్డారు.
పండగవేళ ప్రభుత్వం కార్మికులను పస్తులుంచుతోంది: సీపీఎం - మున్సిపల్ కార్మికుల జీతాలపై సీపీఎం
పండగ వేళ వైకాపా ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను పస్తులుంచుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు అన్నారు. పెరిగిన నిత్యావసర సరకుల ధరలతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని.. జీతాలు చెల్లించకపోతే ఎలా జీవనం సాగిస్తారని నిలదీశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు
వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు తక్షణమే వాటిని చెల్లించాలన్నారు. అప్కాస్ ప్రత్యేక ఏజెన్సీ ద్వారా ప్రతినెలా ఒకటో తేదీన కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందుతాయని ప్రభుత్వం చెప్పిన మాట ఆచరణకు నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న కార్మికులకు వేతనాలు అందకపోతే ఎలా బతుకుతారని నిలదీశారు.
ఇదీ చదవండి:మందుపాతరలకే భయపడలేదు.. గులకరాళ్లకు జంకుతానా?: చంద్రబాబు