కరోనా సమయంలో కార్పొరేట్లకు రూ. 19 వేల కోట్లు రుణమాఫీ చేసి.. పేదలకు కేంద్రం మొండి చెయ్యి చూపించిందని సీపీఎం నాయకులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ఆ పార్టీ నేత సీహెచ్ బాబూరావు తదితరులు పాల్గొన్నారు. సామాన్యుల కష్టాలు గాలికొదిలి... మతోన్మాద, రాజకీయ ఎజెండాతో మోడీ సర్కారు వ్యవహరిస్తుందనిఆయన అన్నారు. అసంఘటిత కార్మికులకు ఉపాధి కరువైందని, ఆదాయం తగ్గిందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై విజయవాడలో సీపీఎం నిరసన - vijayawda cpm latest news
కేంద్ర ప్రభుత్వ విధానాలపై విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు జరిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత సీహెచ్ బాబూరావు పాల్గొన్నారు. లాభాల బాటలో కార్పొరేట్ల కంపెనీలను నడిపిస్తూ.... అప్పుల ఊబిలోకి సామాన్యులను నెట్టుతోందని ఆయన కేంద్రంపై విమర్శించారు.
విజయవాడలో జరిగిన నిరసనలో పాల్గొన్న నేత సీపీఎం బాబూరావు