ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సామాన్యులపై భారం మోపే పన్నులను రద్దు చేయాలి: సీపీఎం - విజయవాడలోని సింగ్ నగర్ లో సీపీఎం నిరసన

విజయవాడలోని సింగ్ నగర్ పైపుల రోడ్డు వద్ద సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. ఆస్తిపన్ను, డ్రైనేజీ, చెత్త పన్నుల పెంపుని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

cpm followers darna at  vijayawada to abolish taxes that are burden for normal people
సామాన్యులపై భారం మోపే పన్నులను రద్దు చేయాలి: సీపీఎం

By

Published : Dec 2, 2020, 4:43 PM IST

ఆస్తిపన్ను, డ్రైనేజీ, చెత్త పన్ను పెరిగే చట్టాలను రద్దు చేయాలని కోరుతూ... విజయవాడలోని సింగ్ నగర్ పైపుల రోడ్డు వద్ద సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. ఆస్తిపన్ను పెంచే జీవో కాపీలను దగ్ధం చేశారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి పన్నుల రూపంలో భారం మోపడం సరి కాదన్నారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచటంతో రూ.100ల్లో ఉన్న పన్నులు వేల రూపాయిలకు పెరుగుతుందన్నారు.

కేంద్రంలో భాజాపా ప్రభుత్వం చట్టాలు చేయటం, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వాటిని అమలు చేయటం సరికాదన్నారు. సామాన్యులపై భారం పడే ఆస్తిపన్ను, డ్రైనేజీ, చెత్త పన్నులను... ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details