ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఖాళీగా ఉన్న ఇళ్లు కేటాయించటానికి సమస్య ఏంటి?' - cpm dharna for housing sites

పట్టణ పేదల కోసం నిర్మించిన ఇళ్లను తక్షణమే కేటాయించాలని.. లేకుంటే వాటిని లబ్ధిదారులతో ఆక్రమించడానికి వెనుకాడమనిమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు హెచ్చరించారు.

vijayawada
' ఖాళీగా ఉన్న ఇళ్లు కేటాయించటానికి ఏంటి సమస్య'

By

Published : Jul 21, 2020, 5:48 PM IST

విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తైన గృహాల వద్ద సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు ఆందోళనకు దిగారు. కట్టి ఖాళీగా ఉన్న ఇళ్లను తక్షణమే పేదలకు కేటాయించకపోతే, పేదలే తమ ఇళ్లను స్వాధీనం చేసుకుంటారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం జపం చేసే వైయస్సార్ ప్రభుత్వం పట్టణాల్లో డిపాజిట్లు కట్టిన పేదలకు ఇళ్లు కేటాయించకపోవడం ఏమి సంక్షేమని ప్రశ్నించారు. ఉగాది, జులై 8, ఇళ్లు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగిలిందని అన్నారు. ఉచితంగా ఇళ్లు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. సంవత్సరం గడిచినా ఖాళీగా ఉన్న ఇళ్లు కేటాయించకపోవటం మాట తప్పటమే అని మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లు పూర్తి చేయాలని.. పట్టాలు ఇవ్వాలని, రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్రవాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి.

ఇదీ చదవండి 'కరోనా కట్టడికే పెట్రోలు ధరలు పెంచామంటారేమో?'

ABOUT THE AUTHOR

...view details