ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పట్టణాలలో ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ ఇవ్వాలి' - ఆస్తిపన్నులో రాయితీ ఇవ్వాలని సీపీఎం డిమాండ్ వార్తలు

రాష్ట్రప్రభుత్వం పట్టణాలలో ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ ఇవ్వాలని ఏపీ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సీహెచ్. బాబురావు అన్నారు. తెలంగాణ తరహాలో ఏపీలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ch baburao
సీహెచ్ బాబురావు, సీపీఎం నేత

By

Published : Nov 16, 2020, 1:16 PM IST

తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్​లోనూ పట్టణాలలో ఆస్తిపన్నులో 50శాతం రాయితీ ఇవ్వాలని ఏపీ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సీహెచ్. బాబురావు డిమాండ్ చేశారు. పెనాల్టీలు రద్దు చేయాలనీ, ఇంటి పన్నులు పెంచే ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని అన్నారు.

కరోనా, ఆర్థిక మాంద్యం కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ ఇచ్చిందని బాబురావు అన్నారు. ఈ నిర్ణయం స్వాగతించదగ్గదన్నారు. ఏపీలోనూ ఇలాంటిది అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీలు ఇవ్వకపోగా పన్ను చెల్లింపులో జాప్యమనే పేరుతో 24శాతం పెనాల్టీ వసూలు చేయడం శోచనీయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details