మహిళలు, ఎస్సీలపై దాడులను నిరసస్తూ సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్‌టేబుల్ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అదుపు చేసేందుకు ఏర్పాటు చేసిన మోనిటరింగ్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం లేదని సీపీఐ నేతలు నిలదీశారు. ఎస్సీ, ఎస్టీల కమిషన్ ఛైర్మన్ ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై సీఎం జగన్‌కు లేఖ రాసినా స్పందన లేదని వామపక్ష నేతలు అసహనం వ్యక్తం చేశారు.
మహిళలు, ఎస్సీలపై దాడులను నిరసిస్తూ సీపీఐ రౌండ్‌టేబుల్ సమావేశం - విజయవాడ తాజా వార్తలు
మహిళలు, ఎస్సీలపై దాడులను నిరసిస్తూ సీపీఐ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ను ఎందుకు నియమించడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మహిళలపై దాడులను ప్రభుత్వం అదుపు చేయలేకపోతుందని విమర్శించింది.
![మహిళలు, ఎస్సీలపై దాడులను నిరసిస్తూ సీపీఐ రౌండ్‌టేబుల్ సమావేశం CPI Round table meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9054615-570-9054615-1601882950531.jpg)
CPI Round table meeting