ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం గారూ.. వేరుశనగ రైతులను ఆదుకోండి'

కరోనా కారణంగా నష్టపోయిన వేరుశనగ రైతులను ఆదుకోవాలని కోరుతూ.. సీఎం జగన్​కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు.

CPI Ramakrishna's letter to CM jagan
సీఎం జగన్​కు సీపీఐ రామకృష్ణ లేఖ

By

Published : May 26, 2020, 9:21 AM IST

ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల్లో 30 లక్షల ఎకరాలకుపైగా వేరుశనగ పంట సాగవుతోందని చెప్పారు. కరోనా విపత్తు వల్ల బహిరంగ మార్కెట్‌లో వేరుశనగ విత్తనం దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఈ ఖరీఫ్‌లో వేరుశనగ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. 60 శాతం రాయితీతో 5 ఎకరాలకు సరిపడా విత్తనాలను రైతులకు అందించాలని... పెండింగ్‌లో ఉన్న పెట్టుబడి రాయితీని వెంటనే చెల్లించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details