లాక్‌డౌన్ కారణంగా కార్మికులు తీవ్రంగా నష్టపోయారని... వారిని ప్రభుత్వాలే ఆదుకోవాలని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా...12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని రామకృష్ణ ఆరోపించారు. మేడే సందర్భంగా విజయవాడ దాసరి భవన్‌లో జెండా ఆవిష్కరించి... కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు మే 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
కార్మికులను ప్రభుత్వాలే ఆదుకోవాలి: సీపీఐ రామకృష్ణ - మే డే
లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులను ప్రభుత్వాలే ఆదుకోవాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ