హోదాపై ప్రజలను సీఎం జగన్ మభ్యపెడుతున్నారని .. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. భాజపాకు రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేని విషయం జగన్కు తెలియదా? అని ప్రశ్నించారు. సీఏఏ, ఎన్ఆర్సీకి మద్దతిచ్చినప్పుడు హోదాపై ఎందుకు గట్టిగా అడగలేదని నిలదీశారు. వచ్చేసారి మీ మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి వస్తారని ఎలా చెబుతారని.. ఇదంతా కేవలం రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడమేనని రామకృష్ణ మండిపడ్డారు.
వాటికి మద్దతిచ్చి.. హోదా ఎందుకు అడగలేదు?: రామకృష్ణ - ప్రత్యేకహోదాపై జగన్ కామెంట్స్ న్యూస్
హోదాపై ఎందుకు మభ్యపెడుతున్నారని ముఖ్యమంత్రి జగన్ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని.. 22 మందిని గెలిపించినా హోదాపై ఏమాత్రం దృష్టి పెట్టలేదని విమర్శించారు.
cpi ramakrishna questions cm jagan over special status to andhrapradesh