ఏడాదిగా ఏ పార్టీని, ప్రజాసంఘాలనూ కలవని.. కనీసం అర్జీలు తీసుకోని ఏకైక ముఖ్యమంత్రిగా జగన్హన్రెడ్డిని గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కించాలన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించిన పాలనలో ఏడాది గడిచినా కనీసం ఒక్క అభివృద్ధి పనైనా చేశారా? అని ప్రశ్నించారు. మంత్రులు చెప్పినట్లు అభివృద్ధి పనులు చూపించాలని రామకృష్ణ సవాల్ విసిరారు. మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్.. అన్నీ మార్చేశారన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి.. ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు తప్ప ఏడాది పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని రామకృష్ణ విమర్శించారు.
సీతయ్య ఎవరి మాట వినడు.. జగన్ ఎవరినీ కలవడు: రామకృష్ణ - ysrcp scheemes in 1 year news
సీతయ్య ఎవ్వరి మాట వినడు.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎవ్వరిని కలవడు.. అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు.
cpi ramakrishna on ysrcp 1 year administration