ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ రాసిన లేఖపై వైకాపా ప్రభుత్వం విమర్శలు చేయటం సమంజం కాదని.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కరోనా ప్రభావం రాష్ట్రంపై అధికంగా లేదని చెప్పిన ప్రభుత్వం.. సినిమా హాళ్లు, విద్యాసంస్థలు ఎందుకు మూసివేసిందని ప్రశ్నించారు. రమేశ్ కుమార్ రాసిన లేఖ.. వైకాపా నాయకులకు పూర్తిగా అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. సమయం ముగిసిన తరువాత కూడా నామినేషన్ల ఉపసంహరించేలా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
'ఎస్‌ఈసీ లేఖ.. వైకాపా నేతలకు పూర్తిగా అర్థంకాలేదు' - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వార్తలు
ఎస్‌ఈసీ లేఖపై ప్రభుత్వ విమర్శలు సమంజసం కాదని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. వైకాపా నాయకులకు లేఖ పూర్తిగా అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. కరోనా ప్రభావం లేదని చెప్పిన ప్రభుత్వం.. ఎందుకు విద్యాసంస్థలు మూసివేసిందని ప్రశ్నించారు.
cpi-ramakrishna-on-ec-letter-in-vijayawada