ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

attack on cbn: దాడి ఘటన పోలీసుల వైఫల్యానికి నిదర్శనం: రామకృష్ణ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

చంద్రబాబు ఇంటిపై దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. దాడి ఘటన పోలీసుల వైఫల్యానికి నిదర్శమన్న ఆయన.. సాక్షాత్తూ ప్రతిపక్ష నేతకే రక్షణ కరవయ్యే పరిస్థితి ఏర్పడడం విచారకరమని వ్యాఖ్యానించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

By

Published : Sep 17, 2021, 11:31 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. దాడి ఘటన పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. సాక్షాత్తూ ప్రతిపక్ష నేతకే రక్షణ కరవయ్యే పరిస్థితి ఏర్పరడం విచారకరమన్న ఆయన.. చంద్రబాబు ఇంటిపై దాడి జరుగుతుందని పోలీసులకు తెలియదా? అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని చెప్పారు. రాజకీయ ఆరోపణలపై భౌతిక దాడులకు దిగడం తగదని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details