సీఎస్ నీలం సాహ్నికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఏమాత్రం నైతిక విలువలున్నా తక్షణమే సీఎస్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుత స్థానంలో ఉండి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని రామకృష్ణ దుయ్యబట్టారు. ప్రపంచం మెుత్తం కరోనా వైరస్ ప్రభావంతో గడగడలాడుతుంటే...ఏపీలో మూడు వారాలపాటు ఉండదని ఎన్నికలు నిర్వహించాలంటూ లేఖ రాయడంలో సీఎస్ అంతర్యమేంటన్నారు. ఓటర్లకు కరోనా సోకి లక్షల మంది వ్యాధి బారినపడేవారని... అసలు ఎవరి సలహా ప్రకారం ఎన్నికల సంఘానికి లేఖ రాశారని రామకృష్ణ ప్రశ్నించారు.
సీఎస్ రాజీనామా చేయాలి: సీపీఐ రామకృష్ణ - సీఎస్ నీలం సాహ్ని
ప్రపంచం మెుత్తం కరోనాతో అల్లాడుతుంటే...ఎన్నికల నిర్వహించాలంటూ ఈసీకి లేఖ రాయడంలో సీఎస్ అంతర్యమేంటని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.
సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ