ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబుపై అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి: సీపీఐ రామకృష్ణ - కరోనా వార్తలు

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుపై పెట్టిన కేసులు తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్​ చేశారు. కరోనాపై ప్రజలను చైతన్యపరిచినందుకే కేసు పెట్టరని విమర్శించారు.

cpi narayana on cbn cases
చంద్రబాబుపై అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి

By

Published : May 8, 2021, 9:59 PM IST

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. కరోనా మహమ్మారి వ్యాప్తిపట్ల అప్రమత్తం చేయడమే చంద్రబాబు చేసిన నేరమా అంటూ ఆయన ప్రశ్నించారు. జార్ఖండ్ సీఎం సోరెన్ ట్వీట్ పై ప్రధాని మోదీకి అందరం సపోర్ట్ చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం కక్షసాధింపు కాదా? అంటూ రామకృష్ణ నిలదీశారు. తనకో నీతి.. ఎదుటివారికి మరో నీతి అన్న రీతిలో సీఎం జగన్​ వైఖరి కొనసాగుతోందని విమర్శించారు. తక్షణమే చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details