ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CPI Ramakrishna: 'జగన్ నిరుద్యోగులను మోసం చేశారు' - జగన్ తాజా వార్తలు

ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను (JOB Calender) వెనక్కి తీసుకుని పోస్టుల సంఖ్య పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన జగన్..నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆక్షేపించారు.

cpi ramakrishna fire on ycp govt over job calender
జగన్ నిరుద్యోగులను మోసం చేశారు

By

Published : Jun 26, 2021, 4:03 PM IST

ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ (Jagan) నిరుద్యోగులను మోసం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మక్దూమ్‌ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 30 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆర్థికశాఖ తెలిపిందన్నారు. నిరుద్యోగులంతా ఏకమై..ఉద్యోగాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను (JOB Calender) వెనక్కి తీసుకుని పోస్టుల సంఖ్య పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్లు నిరుద్యోగులు స్పష్టం చేశారు. ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏపీలోకి కొత్తగా పరిశ్రమలు రాకపోగా.. ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details