'ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతివ్వాలి' - ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతినివ్వాలి
ప్రైవేటు పాఠశాలల్లోనూ ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతినివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వం మాదిరిగానే కనీస వేతనాలు ఇచ్చేలా యాజమాన్యాలను ఒప్పించాలన్నారు.
'ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతినివ్వాలి'
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లోనూ ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు ఎలా తీసుకుంటున్నారో.. అదే విధంగా ప్రైవేటు పాఠశాలల్లో కూడా తీసుకునేలా తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులకూ ప్రభుత్వం మాదిరిగానే కనీస వేతనాలు ఇచ్చేలా యాజమాన్యాలను ఒప్పించాలన్నారు.
TAGGED:
cpi ramakrishna news