ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణను చూసైనా ఏపీలో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి: సీపీఐ రామకృష్ణ

రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణను చూసైనా ఏపీలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్నారు.

సీపీఐ రామకృష్ణ
సీపీఐ రామకృష్ణ

By

Published : Mar 9, 2022, 10:17 PM IST

తెలంగాణను చూసైనా ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 2.35 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే.. గతేడాది 10,143 ఉద్యోగాలకే జాబ్ క్యాలెండర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.

ఈ ఏడాది జనవరి 1న కూడా జగన్‌ మొండిచేయి చూపారని ఆక్షేపించారు. ఈ నెల 12న నిరుద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని జాబ్ క్యాలెండర్ విడుదలపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

"తెలంగాణను చూసైనా ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 2.35 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. గతేడాది 10,143 ఉద్యోగాలకే జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 1న కూడా జగన్‌ మొండిచేయి చూపారు. ఈ నెల 12న నిరుద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధం. జాబ్ క్యాలెండర్ విడుదలపై అసెంబ్లీలో సీఎం ప్రకటించాలి."-రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఇదీ చదవండి

సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.... తెలంగాణలో 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ABOUT THE AUTHOR

...view details