తెదేపా హయాంలో లక్షా 35 వేల కోట్లు అప్పు చేయడానికి 60 నెలలు పడితే...వైకాపా ప్రభుత్వం 20 నెలల్లోనే లక్షా 55 వేల కోట్లు అప్పు చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. తెచ్చిన అప్పుతో ఏ రంగాన్ని అభివృద్ధి చేశారో..శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పురపాలక ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తే...ప్రజలకు భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ ఓటేయాల్సిన అవసరం ఉండదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. వైకాపా అరాచకాలకు పోలీసులు మద్దతుగా నిలవటం సిగ్గుచేటని మండిపడ్డారు. పురపాలక ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
ప్రభుత్వం చేసిన అప్పుపై శ్వేతపత్రం విడుదల చేయాలి: రామకృష్ణ - ప్రభుత్వ అప్పుపై సీపీఐ రామకృష్ణ కామెంట్స్
వైకాపా ప్రభుత్వం 20 నెలల్లోనే లక్షా 55 వేల కోట్లు అప్పు చేసిందని.., తెచ్చిన అప్పుతో ఏ రంగాన్ని అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పురపాలక ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తే..ప్రజలకు భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ ఓటేయాల్సిన అవసరం ఉండదన్నారు.
ప్రభుత్వం చేసిన అప్పుపై శ్వేతపత్రం విడుదల చేయాలి