గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైకాపా ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి(cm jagan) చెప్పారని సీపీఐ రామకృష్ణ అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు మాట మార్చి ప్రత్యేక హోదాపై వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ(narendra modi) ఏపీకి అడుగడుగునా ద్రోహం చేస్తూనే ఉన్నారన్నారు. వైకాపా(ysrcp), తెదేపా(TDP) ఎంపీలందరూ రాజీనామా చేస్తే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగి నరేంద్రమోదీ ఏపీకి చేసిన మోసం బట్టబయలవుతుందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా రాజీనామా చేయాలి: రామకృష్ణ - సీఎం జగన్పై సీపీఐ రామకృష్ణ కామెంట్స్
ఏపీకి ప్రత్యేక హోదా(special status) కోసం వైకాపా, తెదేపా ఎంపీలు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ(cpi ramakrishna) డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు.
cpi ramakrishna
TAGGED:
సీపీఐ రామకృష్ణ తాజా వార్తలు