సంగం డెయిరీలో ప్రభుత్వ జోక్యాన్ని నివారిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వైకాపా ప్రభుత్వానికి చెంపపెట్టని సీపీఐ నేత కె. రామకృష్ణ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కక్షసాధింపు ధోరణితో ముందుకుపోతున్నారని ఆరోపించారు. ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే.. సీఎం మాత్రం మొండి వైఖరితో తెదేపా నేతల సంస్థలను నిర్వీర్యం చేసేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఇకనైనా కక్షలు సాధింపు చర్యలు పక్కనపెట్టి కొవిడ్ నియంత్రణపై దృష్టిపెట్టాలని కోరారు.
హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: సీపీఐ నేత రామకృష్ణ - cpi leader k.ramakrishna latest news
సంగం డెయిరీలో ప్రభుత్వ జోక్యాన్ని నివారిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానాలకు చెంపపెట్టని సీపీఐ నేత కె. రామకృష్ణ అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండకుండా.. ప్రతిపక్షంపై కక్షసాధింపు చర్యలకు దిగడం సరికాదని పేర్కొన్నారు.
![హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: సీపీఐ నేత రామకృష్ణ cpi leader ramakrishna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-cpi-rk-0705newsroom-1620397282-761.jpg)
సీపీఐ నేత రామకృష్ణ