ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CPI Ramakrishna: జగన్.. రాజకోట రహస్యం బయటపెట్టాలి : సీపీఐ రామకృష్ణ - సీపీఐ రామకృష్ణ న్యూస్

ప్రజలు అధికారమిస్తే.. జగన్మోహన్​రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. రెండున్నరేళ్ల పాలనలో తీసుకొచ్చిన అప్పు, చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు చేసిన ఖర్చు వివరాలేవీ ప్రజలకు చెప్పడం లేదన్న ఆయన.. రాజకోట రహస్యం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

రాజకోట రహస్యం బయటపెట్టకపోతే ఎలా ?
రాజకోట రహస్యం బయటపెట్టకపోతే ఎలా ?

By

Published : Oct 18, 2021, 4:49 PM IST

గ్రామాలు, పారిశ్రామికవాడల్లో విద్యుత్ కోతలు మెుదలైనా.. ఎక్కడా కోతలు లేవని మంత్రులు చెప్పటం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కరెంట్ కోతలపై ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని ఇంధన శాఖ కార్యదర్శి హెచ్చరించటం గర్హనీయమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, అప్పులపై జగన్ ప్రభుత్వం నిజాలు ఎందుకు చెప్పదని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్​లో కూర్చొని రాజకోట రహస్యం మాదిరిగా.. ఏ విషయాలూ బయటపెట్టడం లేదని ఆక్షేపించారు.

ప్రజలు జగన్మోహన్​రెడ్డికి అధికారమిస్తే.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. అప్పుల కోసమే ఆర్థిక మంత్రి బుగ్గన దిల్లీలో తిష్ట వేశారన్నారు. రెండున్నరేళ్ల పాలనలో తీసుకొచ్చిన అప్పు, చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు చేసిన ఖర్చు వివరాలు ప్రజలకు చెప్పాలన్నారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రామకృష్ణ.

ABOUT THE AUTHOR

...view details